Skip to main content

Gurukulam: కొత్త డీగ్రీ కాలేజీల ఏర్పాటుకు ప్రతిపాదనలు

రాష్ట్ర జనాభాలో సగం మేర ఉన్న బీసీలకు సంబంధించిన గురుకుల డిగ్రీ కాలేజీల ఏర్పాటు అంశం ఎటూ తేలలేదు.
Gurukulam
కొత్త డీగ్రీ కాలేజీల ఏర్పాటుకు ప్రతిపాదనలు

క్షేత్రస్థాయిలో డిమాండ్‌ ఆధారంగా గురుకుల పాఠశాలలు, గురుకుల జూనియర్‌ కాలేజీల ఏర్పాటుకు అనుమతులిచి్చన ప్రభుత్వం, డిగ్రీ కాలేజీల ఏర్పాటు అంశాన్ని మాత్రం ఇప్పటికీ తేల్చలేదు. విడతలవారీగా డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేయాలని కోరుతూ మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌) ఇప్పటికే రెండుసార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమరి్పంచింది. తాజాగా మరోమారు ప్రతిపాదనలు పంపింది. కనీసం ఉమ్మడి జిల్లాకొకటి మంజూరు చేసినా బీసీ విద్యార్థులకు కొంత ఊరట కలుగుతుందని సొసైటీ భావిస్తోంది.

ఎస్సీ, ఎస్టీలకు 52 డిగ్రీ కాలేజీలు:

రాష్ట్ర అవతరణ తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం దాదాపు ఆరువందల గురుకుల పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటితోపాటు మరో 3 వందల జూనియర్‌ కాలేజీలు అందుబాటు లోకి వచ్చాయి. ఇదే క్రమంలో ఎస్సీ గురుకుల సొసైటీకి 30 డిగ్రీ కాలేజీలు, ఎస్టీ గురుకుల సొసైటీకి 22 డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇవన్నీ మహిళాడిగ్రీ కాలేజీలే. బీసీ గురుకుల సొసైటీ పరిధిలో మాత్రం ఒకేఒక్క మహిళాడిగ్రీ కాలేజీ గజ్వేల్‌లో కొనసాగుతోంది. అయితే మరిన్ని డిగ్రీ కాలేజీల కోసం డిమాండ్‌ విపరీతంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎంజేపీటీబీసీడబ్ల్యూ ఆర్‌ఈఐఎస్‌ తాజా ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే 2022–23 విద్యాసంవత్సరంలో బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను ప్రారంభించే అవకాశముంది. కొత్త విద్యాసంవత్సరానికి కనీసం 3 నెలల ముందు ప్రభుత్వం అనుమతి లభిస్తేనే భవనాల లభ్యత, కాలేజీల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన సాధ్యమవుతుందని అధికారులు అంటున్నారు.

చదవండి: 

Gurukulam: అస్తవ్యస్తంగా కొత్త పాఠశాలలు

గిరిపుత్రుల సమగ్ర వికాసానికి బాటలు.. ఏకలవ్య

Gurukulam: ఐఐటీ, జేఈఈ మెయిన్‌లో గురుకులాల రికార్డు

Published date : 27 Jan 2022 01:48PM

Photo Stories