Good News: ఫిషరీష్ వర్సిటీలో తరగతులు ప్రారంభానికి సన్నాహాలు
ఈ నేపథ్యంలో తాత్కాలిక అద్దె భవనాల పరిశీలన కోసం నరసాపురం ఫిషరీష్ యూనివర్సిటీ ప్రత్యేక అధికారి ఓ.సుధాకర్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం జనవరి 24న నరసాపురంలో పర్యటించింది. పట్టణంలోని పీచుపాలెం, పాతనవరసపురం ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న రెండు ఇంజనీరింగ్ కళాశాలలను ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుతో కలిసి పరిశీలించారు.
రూ.100 కోట్లతో టెండర్లు..
భవనాల పరిశీలన అనంతరం ఎమ్మెల్యే ప్రసాదరాజు తన నివాసంలో అధికారుల బృందంతో సమావేశం నిర్వహించారు. వర్సిటీ కోసం ముందుగా మంజూరైన రూ.100 కోట్లతో అకడమిక్ బ్లాక్, అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, బాయ్స్, గరల్స్ హాస్టల్ బ్లాకులను సరిపల్లిలో నిర్మించాల్సి ఉందన్నారు. అన్ని అనుమతులు మంజూరైన దృష్ట్యా వెంటనే టెండర్లు పిలవాలని అధికారులకు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోనే మొదటిదిగా, దేశంలో మూడోదిగా నిర్మితమవుతున్న ఫిషరీస్ యూనివర్సిటీ దేశానికే తలమానికంగా నిలవాలన్నారు. ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఈఈ ఇ.రాంబాబు, డీఈ టీఎస్‌పీ వర్మతో పాటు నరసాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ బర్రి శ్రీవెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: