Admissions at Gurukul: మార్చిలో గురుకుల ప్రవేశానికి దరఖాస్తులు ప్రారంభం..
సాక్షి ఎడ్యుకేషన్: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని మహాత్మ జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆ పాఠశాలల కన్వీనర్ రమా మోహిని తెలిపారు. నెల్లిమర్ల ఎంజేపీ బీసీ రెసిడెన్సియల్ స్కూల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 2024–25 విద్యా సంవత్సరంలో 5వ తరగతిలో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Course and Job Offer: సాఫ్ట్‌వేర్ డెవలపర్ కోర్సులతో ఉద్యోగావకాశాలు.. శిక్షణకు తేదీ..!
నెల్లిమర్ల, గంట్యాడ, కొత్తవలస, సాలూరు, పార్వతీపురం బాలికల పాఠశాలల్లో 320 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. విజయనగరం, నెల్లిమర్ల, గజపతినగరం, బొబ్బిలి, కురుపాం బాలుర పాఠశాలల్లో మరో 320 సీట్లు అందుబాటులో ఉన్నట్టు వెల్లడించారు. వీటిలో నెల్లిమర్ల బాలుర పాఠశాలల్లో మత్స్యకార బాలురకు ప్రవేశాలు కల్పిస్తామన్నారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2022–23, 2023–24 సంవత్సరాల్లో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నిరంతరాయంగా 3, 4వ తరగతులు చదువుతూ ఉండాలన్నారు.
Internship Opportunity: స్టైపండ్‌తో ఇంటర్నషిప్ అవకాశం.. సంస్థలతో ఒప్పందం..!
మార్చి 1 నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులు ఆన్‌లైన్లో స్వీకరిస్తామని కన్వీనర్ చెప్పారు. విద్యార్థులు వారి సొంత జిల్లాలోనే ప్రవేశ పరీక్ష రాసేందుకు కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలని సూచించారు. ‘విద్యార్థులు’ అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని రమా మోహిని తెలిపారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. వివరాలకు సమీప పాఠశాలల్లోని కార్యాలయాలను సంప్రదించాలని ఆమె సూచించారు.