Scholarships: దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
ఎదులాపురం: జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న దివ్యాంగ విద్యార్థుల నుంచి 2023–24 ఆర్థిక సంవత్సరానికి ప్రిమెట్రిక్ ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీడబ్ల్యూవో మిల్కా సెప్టెంబర్ 14న ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రిన్సిపల్స్, ప్రధానోపాధ్యాయు లు తమ పరిధిలోని విద్యార్థుల వివరాలతో https:// telanganaepass.cgg.gov.inల దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అవసరమైన ధ్రువపత్రాలు జతచేసి సెప్టెంబర్ 30వ తేదీలోపు జిల్లా సంక్షేమాధికారి, మహిళా శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ కార్యాలయంలో అందించాలని, పూర్తి వివరాలకు 08732222058 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
చదవండి:
NMMS Scholarship 2023: పేద విద్యార్థులకు ఏడాదికి రూ.12,000 ఆర్థిక ప్రోత్సాహం
PM Yashasvi Scheme 2023: 30 వేల మందికి రూ.75 వేల నుంచి 1.25 లక్షల వరకు స్కాలర్‌షిప్స్... అర్హతలు...
PM-YASAVI Scheme: 15000 పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు.. అర్హతలు ఇవే..
Published date : 15 Sep 2023 02:57PM