NMMS Scholarship 2023: పేద విద్యార్థులకు ఏడాదికి రూ.12,000 ఆర్థిక ప్రోత్సాహం
స్కాలర్‌షిప్ వివరాలు: ఏడాదికి రూ.12,000 ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.1000 చొప్పున ఏడాదికి మొత్తం రూ.12,000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తిచేసే వరకు ఉపకారవేతనం లభిస్తుంది.
అర్హత
ఏడో తరగతిలో 55శాతం మార్కులు పొందిన విద్యార్థులు పరీక్ష రాయడానికి అర్హులు. తుది ఎంపిక సమయం నాటికి ఎనిమిదో తరగతి లో 55శాతం మార్కులు పొంది ఉండాలి. ప్రభుత్వ,ఎయిడెడ్,స్థానిక సంస్థల పాఠశాలల్లో రెగ్యులర్ విధానంలో చదువుతూ ఉండాలి. విద్యార్థి కుటుంబ వార్షికాదాయం రూ.3,50,000 మించకూడదు.
చదవండి: NMMS Scholarship 2023: ఎంపికై న విద్యార్థులకు ఏడాదికి రూ. 12 వేల సాయం..
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా విద్యార్థులను స్కాలర్‌షిప్‌కు ఎంపికచేస్తారు.
రాతపరీక్ష: ఈ స్కాలర్‌షిప్స్‌కు అర్హులైన అభ్యర్థులను ఎంపికచేసేందుకు రాష్ట్రస్థాయిలో రెండు పేపర్ల రాతపరీక్షలను నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: రాష్ట్ర ప్రభుత్వ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో విద్యార్థుల దరఖాస్తులను ఆయా స్కూళ్లు సమర్పించాలి. దరఖాస్తుల ప్రింట్‌వుట్లను, సర్టిఫికేట్లను డీఈవోలకు పంపాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 10.08.2023
దరఖాస్తు ఫీజు చెల్లింపునకు చివరితేది: 15.09.2023.
సంబంధిత ప్రధానోపాధ్యాయుల ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు చివరితేది: 16.09.2023.
దరఖాస్తు ఫారాలు, సర్టిఫికేట్లను డీఈవో కార్యాలయంలో అందజేసేందుకు చివరితేది: 19.09.2023.
డీఈవో లాగిన్‌లో దరఖాస్తు ఆమోదం పొందేందుకు చివరితేది: 22.09.2023.
వెబ్‌సైట్: https://bse.ap.gov.in/