PG Counselling: పీజీ కౌన్సెలింగ్ విధానాన్ని మార్చాలి
తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్‌లో అక్టోబర్ 1న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం అమలుపరుస్తున్న ప్రవేశ విధానం ద్వారా తెలంగాణలోని ప్రభుత్వ యూనివర్సిటీలు, ప్రభుత్వ కాలేజీల్లో 30 శాతం సీట్లు మిగిలిపోతున్నాయన్నారు. దీంతో బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ప్రభుత్వ యూనివర్సిటీల్లో, ప్రభుత్వ కళాశాలల్లో ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయా శాఖల ఉన్నతాధికారులు ప్రస్తుతం ఉన్న కౌన్సెలింగ్ విధానాన్ని పునఃపరిశీలించి, ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించి మిగిలిన సీట్లను భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశా రు. లేదంటే రాష్ట్ర ఉన్నత విద్యామండలిని ముట్టడిస్తామని హెచ్చరించారు. నాయకులు శ్రీకాంత్, శివకుమార్, సూర్య తదితరులు పాల్గొన్నారు.
చదవండి:
CBSE Scholarships: బాలికలకు సీబీఎస్‌ఈ ఆర్థిక చేయూత.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
Central Govt Scholarship 2022-23: మైనారిటీ విద్యార్థులకు స్కాలర్‌షిప్.. ఎవరు అర్హులంటే..