Skip to main content

భారత్‌లో చదువుకునేలా ఆదేశాలివ్వండి

మధ్యలోనే ఆగిపోయిన వైద్య విద్యను భారత్‌లోనే పూర్తి చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Petition of Ukrainian students in the Supreme Court
భారత్‌లో చదువుకునేలా ఆదేశాలివ్వండి

తెలుగు రాష్ట్రాల్లోని నియో ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, టెక్నాలజీ లిమిటెడ్‌ సమన్వయంతో ఉక్రెయిన్ లోని జపరోజ్‌హై స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీలో వైద్య విద్య అభ్యసిస్తున్నట్లు తెలిపారు. చదువు అర్థాంతరంగా ఆగకుండా భారత్‌లో కొనసాగేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ డాక్టర్‌ బుర్రా విద్య సునీత రాజ్, 50 మంది విద్యార్థుల తరఫున న్యాయవాది రమేశ్‌ అల్లంకి సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్ దాఖలు చేశారు. ఉక్రెయిన్ లో వైద్య విద్య నిమిత్తం తమ తల్లిదండ్రులు అప్పులు చేశారని భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారిందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఉక్రెయిన్ లో వైద్య విద్య పూర్తయిన వారికి ఇంటెర్న్‌షిప్‌లో ఎలాంటి ఇబ్బందులు రావడంలేదని, మధ్యలో ఆగిపోయిన వారే అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మళ్లీ తొలి సంవత్సరం నుంచి కాకుండా ఉక్రెయిన్ లో చదువునే భారత్‌లో కొనసాగేలా చూడాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడానికి మార్గదర్శకాల రూపొందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో అభ్యరి్థంచారు. 

చదవండి: 

 వైద్య, ఆరోగ్యశాఖలో 20 వేల ఖాళీలు

మెడికల్ సీట్లు సాధించిన 17 మంది గురుకుల విద్యార్థులు

త్వ‌ర‌లోనే 9000 పోస్టుల భర్తీకి చర్యలు..

Published date : 28 Mar 2022 01:27PM

Photo Stories