Degree Colleges: డిగ్రీ కాలేజీల్లో బదిలీలకు ఉత్తర్వులు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది బదిలీకి ప్రభుత్వం సెప్టెంబర్ 15న ఉత్తర్వులు జారీచేసింది.
సెప్టెంబర్ 30వ తేదీలోగా వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియను పూర్తిచేయాలని సూచించింది. జూన్ 30 నాటికి పనిచేస్తున్న కళాశాలలో రెండేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారు బదిలీకి అర్హులు. ఐదేళ్ల సర్వీసు పూర్తయినవారికి బదిలీ తప్పనిసరి. 2023 జూన్ 30 నాటికి పదవీ విరమణ చేసేవారికి తప్పనిసరి బదిలీ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఈ క్రమంలో మారుమూల కళాశాలల్లో అధ్యాపకుల కొరతను తీర్చేలా, కాలేజీల్లో పనిభారానికి తగినట్టుగా అధ్యాపకులను భర్తీచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొనడంపై ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ, పాలిటెక్నిక్, గురుకులాలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీ తదితర విద్యా సంస్థలతోపాటు వివిధ శాఖల్లోని ఉద్యోగులకు కూడా బదిలీ పొందే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
Published date : 16 Sep 2021 01:05PM