Skip to main content

Degree Admissions: ఓపెన్‌ వర్సిటీ డిగ్రీ అడ్మిషన్లకు చివరి తేదీ ఇదే..

దేశాయిపేట: డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో 2023–24 విద్యాసంవత్సరానికి డిగ్రీ అడ్మిషన్లకు జ‌నవ‌రి 31వ తేదీ చివరి గడువు అని దేశాయిపేట సీకేఎం ప్రభుత్వ కళాశాల అభ్యాసకుల సహాయ కేంద్రం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎ.ధర్మారెడ్డి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.శశిధర్‌రావు జ‌నవ‌రి 29న‌ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.
Dr. BR. Ambedkar Open University   open university degree admissions    Last date for degree admissions: January 31, 2023-24

ఇంటర్‌ లేదా ఓపెన్‌ ఇంటర్‌, రెండు సంవత్సరాల ఐటీఐ, డిప్లొమా పూర్తి చేసి, ఆసక్తి కలిగిన వారు జనవరి 31వ తేదీ లోపు braouonline.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. సంబంధిత సర్టిఫికెట్లతో సహాయ కేంద్రానికి వచ్చి వెరిఫికేషన్‌ చేసుకొని నిర్ధారించిన ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించి అడ్మిషన్‌ పొందాలని తెలిపారు.

చదవండి: Prof. G Haragopal: వర్సిటీలపై వివక్ష తగదు

రెండవ, మూడవ సంవత్సరం ట్యూషన్‌ ఫీజు చెల్లించే వారు కూడా జనవరి 31వ తేదీ లోపు చెల్లించవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు సహాయ కేంద్రంలో లేదా 73829 29618 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

చదవండి: Employment Courses: ‘ఉపాధి’ కోర్సులపై దృష్టి పెట్టాలి

Published date : 30 Jan 2024 03:26PM

Photo Stories