Schools: ఆన్‌లైన్ నో.. ఆఫ్‌లైన్ ఫుల్
- పాఠశాలల్లో ఇక పూర్తిస్థాయిలో ప్రత్యక్ష తరగతులు
- ఆన్‌లైన్ పాఠాలకు స్వస్తి పలికిన స్కూళ్లు
- దసరా సెలవుల అనంతరం అన్ని తరగతులు షురూ
- తెరుచుకున్న హాస్టళ్లు, గురుకులాలు
అన్ని రంగాల్లో మార్పులు వచ్చాయి. దీంతో కేజీ నుంచి పీజీ వరకు ఆన్‌లైన్ తరగతులు...క్రమంగా ఆఫ్‌లైన్‌లోకి మారుతున్నాయి. ఇప్పటికే స్కూల్స్ కాలేజీలు, హాస్టల్స్ పునఃప్రారంభం కాగా, తాజాగా అడ్డంకులు తొలగడంతో బుధవారం నుంచి గురుకులాలు కూడా తెరుచుకోనున్నాయి. కరోనా నేపథ్యంలో ఇళ్లకు పరిమితమైన విద్యార్థులు సోమవారం నుంచి పెద్ద సంఖ్యలో విద్యాసంస్థలకు హాజరవడం కని్పంచింది.
ఎగ్జామ్స్ తప్పనిసరి
కరోనా సంక్షోభం కారణంగా వరుసగా రెండు విద్యా సంవత్సరాల పాటు పరీక్షలు రాయకుండానే విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. కానీ 2021–22 విద్యా సంవత్సరంలో మాత్రం ఖచి్చతంగా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండటంతో విద్యార్థులు చదువులపై దృష్టి సారిస్తున్నాయి. ఆయా విద్యా సంస్థలు సైతం ప్రత్యక్ష బోధన కోసం సిబ్బందిని మళ్లీ చేర్చుకుంటాయి.
అక్టోబర్ 21 వరకు ఓపెన్ స్కూళ్లలో అడ్మిషన్లకు అవకాశం
గురుకులాల్లో..
సుదీర్ఘకాలం తర్వాత గురుకులాలు బుధవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఇప్పటికే స్కూల్స్ పూర్తి స్థాయిలో తెరుచుకున్నా గురుకులాలకు మాత్రం హైకోర్టు బ్రేక్ వేసింది. సాధారణ పరిస్థితులు నెలకొనడంతో తాజాగా ఇవి కూడా తెరుచుకున్నాయి. గురుకులాల సొసైటీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. రెండు రోజుల క్రితమే వంద శాతం బోధన, బోధనేతర సిబ్బంది హజరు ప్రారంభం కాగా, ఇక విద్యార్ధులు సైతం వంద శాతం హజరయ్యే విధంగా తగిన చర్యలకు ఉపక్రమించాయి. ఇక అన్ని విద్యా సంస్థల్లోనూ కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. భౌతిక దూరం, మాస్క్, శానిటైజేషన్ తప్పనిసరి అని అధికారులు సైతం ఆదేశాలు జారీ చేశారు.
గ్రేటర్‌లో ఇలా...
- గ్రేటర్‌లోని హైదరాబాద్–రంగారెడ్డి–మేడ్చల్ జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యా సంస్థలు సుమారు 7,587 ఉండగా, అందులో దాదాపు 21.49 లక్షలపైగా విద్యార్థులు ఉన్నారు.
- సుమారు 140 పోస్టు మెట్రిక్, 170 ప్రీ మెట్రిక్ (హైస్కూళ్లు) హాస్టళ్లు ఉన్నాయి. ప్రీమెట్రిక్ హాస్టళ్లలో 6 నుంచి 10 వ తరగతి విద్యార్థులకు మాత్రమే అనుమతివ్వగా, పోస్టు మెట్రిక్ హాస్టళ్లలో అడ్మిషన్ ఉన్న కాలేజీ విద్యార్థులు వసతి పొందటానికి అవకాశం కలి్పంచారు.
- మహానగర పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన సుమారు 123 గురుకులాలు ఉన్నాయి. జిల్లాల వారిగా పరిశీలిస్తే హైదరాబాద్ జిల్లా పరిధిలో 36, రంగారెడ్డి జిల్లాలో సుమారు 75, మేడ్చల్–మల్కాజిగిరిలో మాత్రం 22 గురుకులాలు ఉన్నాయి.
మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి