Online Admissions: ఆన్ లైన్ ప్రవేశాలకు వెబ్ లింక్
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ, పశువైద్య, ఉద్యాన కోర్సుల్లో 2021–22 సంవత్సరానికిగాను ఆన్ లైన్ విధానంలో ప్రవేశాలకు పేర్లు నమోదు చేసుకునేందుకు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో లింక్‌ను ఇవ్వటం జరిగిందని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ టి.గిరిధర్ అక్టోబర్ 7న ఒక ప్రకటనలో తెలిపారు.
ఆన్ లైన్ ప్రవేశాలకు వెబ్ లింక్
రైతు కోటాలో లేదా రైతేతర కోటాలో ప్రవేశాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఈ లింక్‌ను ఉపయోగించాలని పేర్కొన్నారు. దరఖాస్తుకు గడువు తేదీ అక్టోబర్ 18తో ముగియనుందని, ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తుకు వర్సిటీ వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏఎన్ జీఆర్‌ఏయూ.ఏసీ.ఇన్ ను సంప్రదించాలని కోరారు. ప్రవేశ గడువు తేదీ ముగిసిన తరువాత విద్యార్థుల సెల్‌ఫోన్ లకు వెబ్ ఆఫ్షన్ లు, కళాశాలల ఎంపికకు సంబంధించిన మెసేజ్‌లు పంపుతామన్నారు.