Degree: తొలివిడత డిగ్రీ సీట్లు సంఖ్య
Sakshi Education
రాష్ట్రంలోని నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల్లో ఆన్ లైన్ అడ్మిషన్లలో భాగంగా నవంబర్ 15న వివిధ కాలేజీల్లో మొదటి సంవత్సరానికి సంబంధించి తొలివిడతగా 1,88,582 సీట్లను విద్యార్థులకు కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి తొలివిడత సీట్ల కేటాయింపు వివరాలను విడుదల చేసిం ది. నాన్ ప్రొఫెషనల్ డిగ్రీ కాలేజీల్లో 3,21,426 (ప్రభుత్వ, ఎయిడెడ్, వర్సిటీల్లో 59,297, ప్రైవేటు కాలేజీల్లో 2,62,129) సీట్లు ఉన్నాయి. తొలివిడతగా 1,88,582 (ప్రభుత్వ, ఎయిడెడ్, వర్సిటీల్లో 36,981, ప్రైవేటు కాలేజీల్లో 1,51,601) సీట్లు కేటాయించారు. తొలివిడత కేటాయింపుల అనంతరం అన్ని కాలేజీల్లో కలిపి 1,32,844 సీట్లు (41.32 శాతం) మిగిలి ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 20,090, ఎయిడెడ్‌లో 1,127, వర్సిటీల్లో 1,099, ప్రైవేటు కాలేజీల్లో 1,10,528 సీట్లు మిగిలి ఉన్నాయి.
చదవండి:
Women Police: మహిళా పోలీసులకు వరం
Published date : 16 Nov 2021 02:50PM