KNRUHS: ఎండీ హోమియో వైద్య సీట్ల భర్తీకి నోటిఫికేషన్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎండీ హోమియో వైద్య సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య వర్సిటీ ఫిబ్రవరి 21న నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఫిబ్రవరి 22 ఉదయం 9 గంటల నుంచి 23వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. పీజీ హోమియో కోర్సులో యాజమాన్య కోటా సీట్లను వెబ్ ఆప్షన్ల ద్వారా భర్తీ చేయనున్నామని పేర్కొంది. మరింత సమచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను చూడాలని సూచించింది.
చదవండి:
జిమ్స్’లో 7 పీజీ హోమియో కోర్సులకు అనుమతి
ఏప్రిల్ 10న ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని జరుపుకుంటారు
Published date : 22 Feb 2023 02:57PM