జిమ్స్’లో 7 పీజీ హోమియో కోర్సులకు అనుమతి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని జీయర్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సర్వీసెస్ (జిమ్స్)లో 7 విభాగాల్లో పీజీ హోమియో కోర్సులను నిర్వహించడానికి అనుమతినిస్తూ వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
హోమియోపతి మెటీరియా మెడికా కోర్సులో 9 సీట్లు, ఆర్గనాన్ ఆఫ్ మెడిసిన్‌లో 9, రిపెర్టరీ కోర్సులో 9, ప్రాక్టీస్ ఆఫ్ మెడిసిన్‌లో 9, పీడియాట్రిక్స్‌లో 6, సైకియాట్రీలో 6, ఫార్మసీలో 6 సీట్ల చొప్పున ప్రవేశాలు కల్పించడానికి అనుమతిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులిచ్చారు.
Published date : 26 Aug 2020 01:39PM