Skip to main content

ఏప్రిల్ 10న ప్ర‌పంచ‌ హోమియోప‌తి దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటారు


ప్ర‌తి ఏడాది ఏప్రిల్ 10న ప్ర‌పంచ‌హోమియోప‌తి దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటారు.
హోమియోప‌తి జౌష‌ధ వ్య‌వ‌స్థ‌ పితామ‌హుడు, సృష్టికర్త అయిన డాక్ట‌ర్ శ్యాముల్ హనీమాన్ గౌర‌వార్థం ఆయ‌న జ‌న్మ‌ దినోత్స‌వాన్ని ప్ర‌పంచ హోమియోప‌తి దినోత్స‌వంగా జ‌రుపుకుంటున్నారు. ఈ 2020వ సంవ‌త్స‌రం హోమియోప‌తి వ్య‌వ‌స్థాప‌కుడి 265వ జ‌యంతిగా గుర్తించారు. ఈ ఏడాది హోమియోప‌తి దినోత్స‌వం థీమ్ ప్ర‌జారోగ్యంలో హోమియోప‌తి ప‌రిధిని మెరుగుప‌ర్చ‌డం.

శామ్యూల్ హనీమాన్:
శామ్యూల్ హనీమాన్ ఏప్రిల్ 10, 1755వ సంవ‌త్స‌రంలో ఫ్రాన్స్‌లోని పారిస్‌లో జన్మించాడు. అతను జర్మన్ వైద్యుడు, గొప్ప పండితుడు, భాషావేత్తగా ప్రశంసలు పొందిన శాస్త్రవేత్త. అతను హోమియోపతి, మానవ ఫార్మకాలజీ పితామహుడు, నానోమెడిసిన్ సృష్టికర్త. అంతేకాదు రసాయన శాస్త్రంలో కొత్త కొత్త స‌మ్మేళ‌నాల‌ను ఆవిష్క‌రిచిన సృష్టికర్త. అతను "హోమియోపతి" అనే పదాన్ని కనుగొన్నాడు. హోమియోపతి ద్వారా వివిధ వ్యాధుల‌ను నయం చేసే మార్గాన్ని కనుగొన్నాడు. అతను జూలై 2, 1843లో మరణించాడు.
Published date : 14 Apr 2020 03:47PM

Photo Stories