Skip to main content

National Scholarship: జాతీయ ఉపకార వేతన పరీక్ష తేదీ ఇదే

నరసరావుపేట ఈస్ట్‌: జాతీయస్థాయిలో నిర్వహించే జాతీయ ప్రతిభాన్వేషణ ఉపకార పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్‌) 2023–24 విద్యాసంవత్సరానికి డిసెంబర్‌ 3న జరుగుతుందని పల్నాడు డీఈఓ కె.శామ్యూల్‌ న‌వంబ‌ర్ 29న‌ తెలిపారు.
National Scholarship Exam   National Talent Merit Examination announcement by Palanadu DEO K. Samuel on November 29, 2023.

 డివిజన్‌ కేంద్రాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. విద్యార్థులు తమ హాల్‌ టికెట్లను www.bre.ap.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి ఆయా పరీక్ష కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లకు డిసెంబర్‌ 1వ తేదీ డిసెంబ‌ర్ 1న‌ ఉదయం 11 గంటలకు డీఈఓ కార్యాలయంలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినట్లు వివరించారు.

చదవండి: Griffith University Scholarship: గుంటూరు యువకుడికి ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం స్కాలర్‌షిప్‌

ఉత్తీర్ణులైన విద్యార్థులకు 4 సంవత్సరాల పాటు ఏడాదికి రూ.12 వేలు అందిస్తారని వివరించారు. దేశవ్యాప్తంగా లక్ష మంది విద్యార్థులను ఎంపిక చేయనుండగా, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 4,078 మంది విద్యార్థులకు ఉపకార వేతనం లభిస్తుందని తెలిపారు. గత ఏడాది 3,404మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా ఈఏడాది 3,004మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.

Published date : 30 Nov 2023 03:32PM

Photo Stories