Prof Rajendra Singh: డిగ్రీ కోర్సులు ఆధునీకరణ
డిసెంబర్ 18న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ అటానమస్ కళాశాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేళ్ల నుంచి మెట్రోపాలిటన్ నగరంలాంటి హైదరాబాద్‌తోపాటు, వివిధ జిల్లాలో కళాశాలలో బీబీఏ లాజిస్టిక్స్, బీబీఏ రిటైల్ మార్కెటింగ్, బీబీఏ అగ్రికల్చర్ వంటి ఉపాధి కోర్సులను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు.
చదవండి: Fake Online Degrees: ఈ ఆన్‌లైన్ డిగ్రీలతో జాగ్రత్త - UGC
ఇందులో భాగంగా గతేడాది విద్యార్థులు ట్రైనింగ్‌కు వెళ్లగా, మూడు రోజులు కళాశాల, మూడు రోజులు వివిధ కంపెనీలు ట్రైనింగ్ ఇవ్వడంతో విద్యార్థులు నెలకు రూ.7వేలు నుంచి రూ.11 వేల వేతనం సంపాదిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 145 ప్రభుత్వ డిగ్రీ కళాశాలు ఉన్నా యి. వీటిలో 54 వేర్వేరు సబ్జెక్ట్ కాంబినేషన్లతో వివిధ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు.
ప్రభుత్వ కళాశాలను బలోపేతం చేస్తూ, ప్రైవేటు కళాశాలలకు దీటుగా గ్రామీణ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడం జరుగుతుందన్నారు. బోధన సిబ్బందిని బోధనతోపాటు, పరిశోధన వైపు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేలు ప్రోత్సాహకంగా అందిస్తుందన్నారు.