Skip to main content

వైస్‌ చాన్స్‌లర్ల సమావేశాలు

సెప్టెంబర్‌ 29 నుంచి అక్టోబర్‌ 2 వరకు వ్యవసాయ విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్స్‌లర్ల సమావేశం జరగనుంది.
Meetings of Vice Chancellors
వైస్‌ చాన్స్‌లర్ల సమావేశాలు

సమావేశానికి దాదాపు 50 నుంచి 55 మంది వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక, మత్స్య విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్స్‌లర్లు హాజరవుతారని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ఆర్‌.సి.అగ్రవాల్, కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ బి.నీరజ ప్రభాకర్‌ తెలిపారు. సమావేశంలో ప్రధానంగా ఆరు అంశాలపై వివిధ విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్స్‌లర్లు చర్చిస్తారని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో రెవెన్యూ జనరేషన్, ఎంటర్‌ప్రైన్యూర్‌ షిప్, వ్యవసాయ విద్య ప్రపంచీకరణ, వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు సంయుక్త పరీక్షల నిర్వహణ, డిగ్రీ స్థాయిలో యోగా, మెడిటేషన్‌లతో పాటు ఫౌండేషన్‌ కోర్సులు ప్రవేశపెట్టడం, ఆరో డీన్స్‌ కమిటీ, సహజ వ్యవసాయంపై సిఫార్సులు, సలహాలు, గ్లోబల్‌ ర్యాంకింగ్‌ కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయాల వ్యవస్థలో అంతరాల విశ్లేషణ, రానున్న 20 ఏళ్లలో వ్యవసాయ రంగంలో మానవ వనరుల అవసరాలపై శోధనలతో పాటు ప్రభుత్వ– ప్రైవేటు భాగస్వామ్యం అవకాశాలు అనే అంశాలపై విస్తృతంగా చర్చిస్తారని వివరించారు. 

చదవండి: 

వ్యవసాయ కోర్సులకు భారీ ఫీజులు

ICAR-AIEEA 2022: ఐకార్‌ కోర్సులు, పరీక్ష విధానం.. విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు..

Published date : 30 Sep 2022 03:14PM

Photo Stories