Icar Scientist: ప్రపంచ మొక్కల పరిశోధకుల జాబితాలో ఐకార్ శాస్త్రవేత్త
Sakshi Education
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్) శాస్త్రవేత్త జూకంటి అరవింద్‌కుమార్ ప్రపంచ మొక్కల జీవ, వృక్ష శాస్త్రం పరిశోధకుల జాబితాలో స్థానం సంపాదించాడు.
ఈ జాబితాలో 22 మంది భారతీయ శాస్త్రవేత్తలు ఉన్నారు. ఇది భారతదేశంలోని వ్యవసాయ పరిశోధన రంగంలోని ప్రతిభను ప్రపంచానికి చాటి చెబుతుంది. అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ వ్యవసాయ విభాగాధిపతి జాన్ పీఏ అయోడినిస్ నేతృత్వంలో ఈ పరిశోధనలు నిర్వహించబడ్డాయి.
2023-24లో జరిగిన పలు అధ్యయనాల ఆధారంగా ఈ జాబితా రూపొందించబడింది. నారాయణఖేడ్‌కు చెందిన అరవింద్‌కుమార్ 2012లో ఐకార్‌లో చేరారు. 2017 నుంచి రాజేంద్రనగర్‌లోని వరి పరిశోధన సంస్థలో పనిచేస్తున్నారు.
Shreyams Kumar: ఐఎన్‌ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రేయామ్స్ కుమార్
Published date : 30 Sep 2024 09:36AM