Skip to main content

‘ఎకో ఇండియా’తో వైద్య, ఆరోగ్య శాఖ ఎంవోయూ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, ఆరోగ్య కార్యకర్తల సామర్థ్యం పెంపొందించేందుకు అవసరమైన కార్యక్రమాల అమలు కోసం ఏపీ నేషనల్‌ హెల్త్‌ మిషన్‌(న్యూఢిలీ)కు చెందిన ఎకో ఇండియా సంస్థతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఎంవోయూ కుదుర్చుకుంది.
Medical and Health Department MOU with Eco India
ఎంవోయూ పత్రాలు మార్చుకుంటున్న సీఎఫ్‌డబ్ల్యూ నివాస్, ఎకో ఇండియా ప్రతినిధులు 

మంగళగిరిలోని వైద్య శాఖ కార్యాలయంలో ఫబ్రవరి 3న ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ జె.నివాస్, ఎకో ఇండియా అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ సందీప్‌ భల్లా, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ దీపా ఝా ఎంవోయూ పత్రాలపై సంతకాలు చేశారు.

చదవండి: ప్రైవేట్ ప్రాక్టీస్ కన్నా... ప్రభుత్వ ఉద్యోగమే ముద్దు..

డాక్టర్‌ సందీప్‌ భల్లా మాట్లాడుతూ వివిధ అంశాలపై వైద్య సిబ్బందికి వర్చువల్‌ విధానంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఎంవోయూ అనంతరం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబుతో ఎకో ఇండియా బృందం భేటీ అయ్యింది. 

చదవండి: 8.78 లక్షల ర్యాంకుకూ ఎంబీబీఎస్ సీటు

Published date : 04 Feb 2023 02:59PM

Photo Stories