RGUKT: ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల
Sakshi Education
Rajiv Gandhi University of Knowledge Technologies(RGUKT) పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశానికి సంబంధించిన అర్హులైన అభ్యర్థుల జాబితాను సెప్టెంబర్ 29న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేస్తారని చాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి సెప్టెంబర్ 28న ఓ ప్రకటనలో తెలిపారు.
విజయవాడలో ఉదయం 10.30 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారని పేర్కొన్నారు. ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల కోసం 44,208 దరఖాస్తులొచ్చాయని, సెప్టెంబర్ 19 వరకు దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. అక్టోబర్ 12 నుంచి 15 వరకు కౌన్సెలింగ్ నిర్వహించి, 17 నుంచి తరగతులు ప్రారంభిస్తామని వివరించారు.
చదవండి: AP RGUKT IIIT notification 2022-2023: పదో తరగతితోనే.. బీటెక్
కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన
రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలోని 4 ట్రిపుల్ ఐటీలకు నిర్వహిస్తున్న అడ్మిషన్లలో భాగంగా స్థానిక ట్రిపుల్ ఐటీలో సెప్టెంబర్ 28న పలు కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను నిర్వహించారు. ఎన్‌సీసీ, స్పోర్ట్స్, వికలాంగుల, సైనిక ఉద్యోగుల పిల్లల కోటాలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను అధికారులు పరిశీలించారు. 30వ తేదీ వరకు పరిశీలన కొనసాగనుంది.
చదవండి: RGUKT: పాత పద్ధతిలోనే ప్రవేశాలు
Published date : 29 Sep 2022 03:52PM