Polytechnic: పరిశ్రమతో పాలిటెక్నిక్ విద్య అనుసంధానం
సాక్షి, అమరావతి: పాలిటెక్నిక్ విద్యను పరిశ్రమకు అనుసంధానించే కార్యక్రమంలో భాగంగా విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అవెరా సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ల్యాబ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అవెరా సంస్థ ప్రతినిధులు కళాశాలను సందర్శించి కొత్త భవనంలోని కింద అంతస్తు, ఇతర క్లాసు రూమ్ గదులను పరిశీలించారని పేర్కొన్నారు. త్వరలో ప్రయోగశాల ఏర్పాటుకు ఒప్పందం చేసుకోనున్నట్టు తెలిపారు. అవెరా ఎలక్ట్రిక్ వెహికల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ సీఈవో, భారత పరిశ్రమల సమాఖ్య విజయవాడ చాప్టర్ చైర్మన్ డాక్టర్ వెంకట రమణ, ఓఎస్‌డీ కార్తికేయతో పాటు సాంకేతిక విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ వెలగా పద్మారావు, ఎస్‌బీటీఈటీ కార్యదర్శి రమణబాబు తదితరులు పాల్గొన్నారు.
విజయవాడ పాలిటెక్నిక్‌లో అవెరా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ల్యాబ్ సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి వెల్లడి