Justice T. S. Sivagnanam: క్రమశిక్షణతో జీవితం ఉజ్వలం
మదురైలో నవంబర్ 6న హెరిటేజ్ వేల్ఫేర్ ఫౌండేషన్ వారికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జస్టిస్ శివజ్ఞానం మాట్లాడుతూ, క్రమ శిక్షణ కలిగి ఉంటే జీవితంలో ఎన్నో విజయాలు దరిచేరుతాయని పేర్కొన్నారు. అలాగే క్రమశిక్షణతో పాటు విద్యా వంతులుగా ఎదిగేందుకు ప్రతి విద్యార్ధి తమ ప్రతిభా పాఠవాలను మెరుగు పరచుకోవాలని పిలుపు నిచ్చారు.
చదవండి: DEO Janardhan Rao: విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
సిలంబం(కర్రసాము) తమిళప్రజల సంస్కృతిలో అంతర్గతంగా ముడిపడి ఉందని, ఇది యుద్ధ కళ అని, సాంస్కృతిక కళ అని వివరించారు. కార్మిక సంక్షేమ శాఖ అదనపు ముఖ్యకార్యదర్శి కుమార్ జయంత్ మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, వ్యాయాయంపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు.
హెరిటేజ్ వేల్ఫేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రుక్మిణి త్యాగరాజన్ మాట్లాడుతూ, గ్రామీణ పిల్లలకు సాయం అందించడం, వారి జీవితాలలో మార్పు తీసుకొచ్చేందుకు సేవా కార్యక్రమాలను విస్తృతం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాఖ్యాత సి. గోపీనాథ్‌తోపాటు 7 గ్రామాలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు సిలంబంతో యుద్ధ కళలను ప్రదర్శించారు.