DEO Janardhan Rao: విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
కరీంనగర్ మంకమ్మతోటలోని సాయి మానేరు పాఠశాలలో నవంబర్ 6న నిర్వహించిన 31వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లాస్థాయి ప్రదర్శన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయడానికి ఎన్‌ిసీఎస్‌సీ వేదికగా నిలుస్తుందన్నారు. నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలను ప్రాజెక్టులుగా రూపొందించాలని సూచించారు.
మానేరు విద్యాసంస్థల చైర్మన్ కడారి అనంతరెడ్డి మాట్లాడుతూ.. సైన్స్‌పై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. చంద్రయాన్–3 సక్సెస్ స్ఫూర్తితో సైంటిస్టులుగా ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా సైన్స్ అధికారి జయపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్‌సీఎస్‌సీ జిల్లాస్థాయి పోటీలకు జిల్లా వ్యాప్తంగా 97 ప్రాజెక్టులు వచ్చాయన్నారు. వీటిలో 4 ఉత్తమ ప్రాజెక్టులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
చదవండి: Sakshi Media Group: ప్రతిభకు మెట్టు
డీసీఈబీ కార్యదర్శి మారం స్వదేశ్‌కుమార్, మానేరు విద్యాసంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ఫిజికల్ సైన్స్, బయోసైన్స్ ఫోరం అధ్యక్షులు ఎం.శ్రీనివాస్, వి.ఆంజనేయులు, న్యాయనిర్ణేతలు శ్రీనివాసరెడ్డి, సాయి మధుకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఇటీవల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందిన కేఎస్.అనంతాచార్య, జి.మనోహర్ రెడ్డి, సీహెచ్.శ్రీనివాస్‌లను డీఈవో సత్కరించారు. మానేరు విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఆయనను సన్మానించారు.