Sakshi Media Group: ప్రతిభకు మెట్టు
ఇక ఆంగ్ల మాధ్యమ పాఠశాలల సంగతి చెప్పనక్కెర లేదు. ఈ రోజుల్లో విద్యార్థులకు ఆంగ్ల భాషలోని పదాలు, వాటిని పలికే విధానం, కొత్త పదాలు ఎలా ఉంటేయో తెలిపేందుకు సాక్షి, ఇండియా స్పెల్ బీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేస్తున్న ప్రయోగం స్పెల్ బీ పరీక్ష. విద్యార్థులకు ఆంగ్లంపై ఆసక్తిని పెంచేందుకు, వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి, అక్షర దోషం లేకుండా రాయడానికి స్పెల్ బీ పరీక్ష దోహదపడుతుంది.
చదవండి: Gurukula teaching posts: గురుకులాల్లో టీచింగ్ పోస్టుల భర్తీకి ఆమోదం
ఈనేపథ్యంలో ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో నవంబర్ 6న కరీంనగర్‌లోని రావూస్ పాఠశాలలో నిర్వహించిన స్పెల్ బీ మొదటి రౌండ్ పరీక్షకు స్పందన వచ్చింది. విద్యార్థులకు కేటగిరీల వారీగా పరీక్ష నిర్వహించారు. కేటగిరీ 1లో 1,2వ తరగతి విద్యార్థులు, 2వ కేటగిరీలో 3, 4, కేటగిరీ 3లో 5,6,7 తరగతులు, 4వ కేటగిరీలో 8,9,10 విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో రావూస్ పాఠశాల ప్రిన్సిపాల్ ఎండీ రహమాన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ప్రతిభను వెలికితీస్తున్న స్పెల్ బీ
ఇంగ్లిష్‌ను కష్టంగా కాకుండా ఇష్టంగా నేర్చుకుంటారు. ఇంగ్లిష్ నేర్చకోవాలన్న ఆలోచనను ‘సాక్షి’ తీసుకొచ్చింది. స్పెల్ బీతో విద్యార్థుల మధ్య ఆరోగ్యవంతమైన పోటీ ఏర్పడుతుంది. ఇలాంటి పరీక్షలను నిర్వహించి విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసే అవకాశం ‘సాక్షి’ కల్పించడం అభినందనీయం.
– ఎండీ రహమాన్, రావూస్ స్కూల్ ప్రిన్సిపాల్
కొత్త పదాలు తెలిశాయి
నేను స్పెల్‌బీ పరీక్ష రాశా. న్యూ వర్డ్స్ నేర్చుకున్నా. చాలా కొత్త పదాలు ఉన్నాయి. బుక్స్‌లో లేని పదాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకున్నా. జోనల్ రౌండ్‌కు కూడా సెలెక్ట్ అవుతా. ఇంకా కొత్త పదాలు నేర్చుకుంటా.
– మిషా జైన్, 1వ తరగతి
ఇంగ్లిష్‌పై పట్టు సాధించా
స్పెల్ బీతో ఇంగ్లిష్‌పై పట్టు సాధించా. స్పెల్లింగ్స్ కూడా చాలా వరకు నేర్చుకున్న. మొదటి రౌండ్ బాగా రాశా. జోనల్, ఫైనల్ రౌండ్‌కు కూడా అర్హత సాధిస్తా. ఇంగ్లిష్ పదాలు మరిన్ని నేర్చుకోవాలనిపిస్తుంది. స్పెల్ బీ పరీక్ష బాగుంది. కొత్తకొత్త పదాలు తెలి శాయి.
– హృతిక్ సాయివర్మ, 5వ తరగతి
నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది
స్పెల్ బీ పరీక్షతో మాలో నాలెడ్జ్ ఇంప్రూవ్ అయ్యింది. ఏటా ఇలాంటి పరీక్షలను ప్రతీ స్కూల్‌లో నిర్వహించాలి. ‘సాక్షి’ స్పెల్‌బీ విద్యార్థులకు చాలా ఉపయోగపడే పరీక్ష. బుక్స్‌లో చాలా హార్డ్ వర్డ్స్ ఉన్నాయి. అన్ని స్పెల్లింగ్స్ తెలుసుకున్నాం.
– భువనేశ్వరి, అమితారెడ్డి, 9వ తరగతి
ఫైనల్ రౌండ్‌కు వెళ్తా..
స్పెల్ బీ పరీక్ష ఫస్ట్ రౌండ్ చాలా బాగా రాశా. సెకండ్, థర్డ్ రౌండ్‌లతో పాటు ఫైనల్ రౌండ్ వరకు వెళ్లడమే నా టార్గెట్. బుక్ బాగా ప్రిపేర్‌అయ్యా. పరీక్ష కూడా హార్డ్‌గా ఉంది. అన్నింటికీ కరెక్ట్‌గా స్పెల్లింగ్స్ రాశాను.
– జి.మనోగ్న, 8వ తరగతి