KU: లా పరీక్షల ఫీజు చెల్లింపు చివరి తేదీ ఇదే..
Sakshi Education
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మూడేళ్ల లా కోర్సు రెండో, నాల్గో, ఆరవ సెమిస్టర్ పరీక్షలకు, ఐదేళ్ల లా కోర్సు రెండో, నాల్గవ, ఆరవ, 8వ, 10వ సెమిస్టర్ పరీక్షలకు (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్‌మెంటు) విద్యార్థులు ఆగస్టు 5 వరకు ఎలాంటి అపరాద రుసుము లేకుండా పరీక్షల ఫీజులు చెల్లించాలని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య పి.మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ రాధిక ఒక ప్రకటనలో కోరారు.
రూ 250 అపరాధ రుసుముతో 8 వరకు గడువు ఉందన్నారు. రెగ్యులర్ విద్యార్థులకు ఫీజు రూ.1030, మూడేళ్ల ఆరవ సెమిస్టర్, ఐదేళ్ల 10వ సెమిస్టర్ రెగ్యులర్ విద్యార్థులకు రూ.1360, బ్యాక్ లాగ్స్ రెండు పేపర్లకు పైన ఫీజు రూ.930, రెండు పేపర్ల వరకు రూ.400, ఇంప్రూవ్‌మెంటు ప్రతి పేపర్‌కు రూ 300ల చొప్పున పరీక్ష ఫీజు చెల్లించాల్సింటుందని వారు పేర్కొన్నారు.
చదవండి:
Published date : 29 Jul 2023 03:31PM