G Gnanamani: 31 నుంచి కేయూలో కృష్ణా తరంగ్
ఆయన తన చాంబర్లో నవంబర్ 21న విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మూడు రోజులపాటు జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో విశ్వవిద్యాలయం పరిధిలోని 200 కళాశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు సుమారు 2000 మంది హాజరవుతారని తెలిపారు.
చదవండి: Essay Writing Competition: రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీల్లో విద్యార్థినికి గోల్డ్ మెడల్
ఐదు విభాగాలకు సంబంధించి 27 అంశాల్లో పోటీలు జరుగుతాయన్నారు. వీటిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులు దక్షిణ మండల (సౌత్‌జోన్) పరిధిలో జరిగే పోటీల్లో పాల్గొంటారన్నారు.
కార్యక్రమ నిర్వహణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విశ్వవిద్యాలయం ఉద్యోగులను కోరారు. అనంతరం కార్యక్రమ వాల్‌పోస్టర్లను వీసీ ఆవిష్కరించారు. సమావేశంలో రిజిస్ట్రార్ డాక్టర్ వీరబ్రహ్మచారి, ఆచార్య సుందరకృష్ణ, ఆచార్య దిలీప్ సహచర్యులు, ఆచార్య కోటేశ్వరరావు, లావణ్య లత, డాక్టర్ శ్రావణి డాక్టర్ విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.