Skip to main content

TSCHE: డిగ్రీ విద్యలో కీలక మార్పులు

సాక్షి, హైదరాబాద్‌: ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ విద్యలో కీలక సంస్కరణలు తేవాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది.
TSCHE
డిగ్రీ విద్యలో కీలక మార్పులు

ఇంజనీరింగ్‌తో సమానమైన బీఎస్సీ హానర్స్‌ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సును తెచ్చేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ దిశగా అన్ని విశ్వవిద్యాలయాలను అప్రమత్తం చేస్తూ, మండలి కొన్ని సూచనలు చేసింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి నేతృత్వంలో జూన్‌ 9న హైదరాబాద్‌లో కీలక సమావేశం జరిగింది. సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ, కాలేజీయేట్, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్, మండలి కార్యదర్శి ప్రొఫెసర్‌ ఎన్‌.శ్రీనివాసరావు, ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ మహిళ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు విశ్వవిద్యాలయాల వీసీ లు పాల్గొన్నారు. సమావేశ వివరాలను ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి మీడియాకు వివరించారు.  

చదవండి: TSCHE: లోతైన పరిజ్ఞానం.. తక్షణ ఉపాధి.. మారనున్న యూజీ డిగ్రీ స్వరూపం

50 కాలేజీల్లో బీఎస్సీ (ఆనర్స్‌) కంప్యూటర్స్‌ 

ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని దాదాపు 50 కాలేజీల్లో నాలుగేళ్ల కాలపరిమితితో బీఎస్సీ (ఆనర్స్‌) కంప్యూటర్స్‌ కోర్సును ప్రవేశపెడతారు. ఇప్పటికే 36 ప్రైవేటు కాలేజీలు ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. పది ప్రభుత్వ కాలేజీల్లోనూ ఇది అందుబాటులో ఉంటుంది. హానర్స్‌ కోర్సుకు ప్రతి కాలేజీలో 60 సీట్లు కేటాయిస్తారు. 

చదవండి: TSCHE: బీకాం.. భారీగా ఇన్‌కం!.. సాఫ్ట్‌వేర్‌తో పోటీ...

ద్వితీయ సంవత్సరంలో సైబర్‌ సెక్యూరిటీ... 

డిగ్రీ రెండో సంవత్సరంలో సైబర్‌ సెక్యూరిటీ కోర్సును తప్పనిసరి చేస్తున్నారు. వాల్యూయాడెడ్‌ కోర్సుగా దీన్ని అందిస్తారు. ఇది రెండో సంవత్సరానికే పరిమితం. దీనికి 4 క్రెడిట్స్‌ ఉంటా యి. పోలీసు శాఖ, నల్సార్‌ యూనివర్సిటీ, జేఎన్‌టీయూహెచ్, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈ కోర్సును డిజైన్‌ చేస్తుంది.  

చదవండి: TSCHE: డిగ్రీలో కొత్త కోర్సు.. కోర్సు ప్రత్యేకతలివీ...

పరీక్ష విధానంలో క్షేత్రస్థాయి మార్పులు 

రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత పరీక్షల విధానం, మూల్యాంకనం, విద్యార్థి ప్రతిభను అంచనా వేసే పద్ధతిపై అధ్యయనం చేసిన ఇండియస్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) వీసీల సమావేశంలో ఓ నివేదిక సమర్పించింది. ఆరు యూనివర్శిటీలు, 14 కాలేజీల్లో 3 వేల మంది విద్యార్థుల ద్వారా చేసిన అభిప్రాయ సేకరణ ఆధారంగా రూపొందించిన ఈ నివేదికను ఐఎస్‌బీ తరపున ప్రొఫెసర్‌ చంద్రశేఖర్‌ శ్రీపాద వీసీలకు వివరించారు. అందులోని కొన్ని సంస్కరణలను ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తారు.  

  • మూల్యాంకన విధానంలో క్షేత్రస్థాయిలో మార్పులు, రూట్‌ లెర్నింగ్‌ అప్లికేషన్‌ తీసుకొస్తారు. మార్కుల విధానం తీసేసి క్రెడిట్స్‌ విధానం అమలు చేస్తారు. 
  • ప్రతి వర్సిటీలోనూ సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ అవాల్యూషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, దీనికి ప్రత్యేక అధికారిని నియమిస్తారు.  
  • ప్రస్తుతం 80 మార్కులు పరీక్షకు, 20 మార్కు లు ఇంటర్నల్స్‌కు ఇస్తున్నారు. ఇందులో థియరీ మార్కులు తగ్గించి, ఇతర కార్యకలాపాలకు ఈ మార్కులను విభజిస్తారు. 
  • విద్యార్థి అటెండెన్స్, గ్రూపు డిస్కషన్స్, ప్రాజెక్టు వర్క్స్, ఇన్నోవేషన్, సెమినార్స్‌ వంటి వాటికి మార్కులు ఇస్తారు. దీనివల్ల విద్యార్థిలో సృజనాత్మకత పెరుగుతుంది.
Published date : 10 Jun 2023 11:02AM

Photo Stories