Skip to main content

6th Class Admissions: 25లోగా నవోదయకు దరఖాస్తు చేసుకోవాలి

JNVST Navodaya 6th Class Admission 2024-25 Apply Online
  • ఉమ్మడి జిల్లాలో నవోదయలో 10వేలు సీట్లు 
  • నవోదయ అడ్మిషన్ల కోఆర్టినేటరు శ్రీధర్‌

నాతవరం: విద్యార్థులు నవోదయలో చేరేందుకు ఈనెల 25వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి జిల్లా నవోదయ ఆడ్మిషన్ల కోఆర్టినేటరు శ్రీధర్‌ అన్నారు. ఆయన నాతవరం ఎంఆర్‌సీ కార్యాలయంలో ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి నవోదయలో విద్యార్థులు చేరేందుకు దరఖాస్తులు చేయించాలని అవగాహన కల్పించారు. నవోదయ స్కూల్‌లో ప్రభుత్వం కాంట్రాక్టరు పద్ధతిలో పని చేసే ఉపాద్యాయులను తొలగించి రెగ్యులర్‌ ఉపాధ్యాయులను నియమించిందన్నారు. విద్యార్థులకు అసక్తి ఉన్న విధంగా విద్యతో పాటు క్రీడలు ఆటల పోటీలపై తర్పీదు ఇవ్వడం జరుగుతుందన్నారు. కేంద్రప్రభుత్వ విద్యా సంస్థల్లో చేరేందుకు ఎన్‌ఐటి ఐఐటీ వంటి పోటీ పరీక్షల కోసం హైస్కూల్‌ స్థాయి నుంచే విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇతర వివరాలకు 7799272555 నెంబరును సంప్రదించాలన్నారు.

చదవండి: Admissions: ‘నవోదయ’ దరఖాస్తు గడువు మరోసారి పెంపు

Published date : 22 Aug 2023 02:31PM

Photo Stories