పెద్దవూర: మండలంలోని చలకుర్తి క్యాంపు జవహర్ నవోదయ విద్యాలయం (జేఎన్‌వీ)లో 2024–25 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవడానికి గడువును ఆగస్టు 25వ తేదీ వరకు పొడిగించినట్లు విద్యాలయం ప్రిన్సిపాల్ ఆర్.నాగభూషణం తెలిపారు.
‘నవోదయ’ దరఖాస్తు గడువు మరోసారి పెంపు
ఆగస్టు 17వ తేదీ వరకు గడువును పెంచిన నవోదయ విద్యాలయ సమితి మరోసారి పది రోజుల పాటు పొడిగించారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.నవోదయ.జీఓవీ.ఇన్ లేదా డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూ.జేఎన్‌వీ నల్లగొండ.ఇన్ వెబ్‌సైట్‌ల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.