Admissions: శ్రీకాకుళం ఐటీఐ శిక్షణా కేంద్రంలో 28న ఐటీఐ కౌన్సెలింగ్
2024–25 విద్యా సంవత్సరంలో ఇప్పటికే మూడు విడతలు పూర్తి కాగా.. తాజాగా నాలు గో విడత ప్రవేశాలకు సెప్టెంబర్ 26వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా అభ్యర్థులు ఐటీఐ.ఏపీ.జీవోవి.ఇన్ అనే వెబ్‌పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
సెప్టెంబర్ 27లోగా తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరై సరిఫికెట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. సెప్టెంబర్ 28న ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం బలగ హాస్పిటల్ జంక్షన్‌లో ఉన్న డీఎల్‌టీసీ/ఐటీఐ శిక్షణా కేంద్రంలో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాల ని కోరారు. శ్రీకాకుళం డీఎల్‌టీసీలో కేంద్రంలో మహిళలకు సూయింగ్ టెక్నాలజీ(టైలరింగ్ శిక్షణ) కోర్సుల్లోఖాళీలు ఉన్నట్టు పేర్కొన్నారు.
చదవండి: RGUKT: ఆర్జీయూకేటీ ఉద్యోగులకు శిక్షణ
రిజిస్ట్రార్‌ను కలిసిన ట్రిపుల్ ఐటీ అధికారులు
ఎచ్చెర్ల క్యాంపస్: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ అమరేంద్రకుమార్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. నూజివీడు వెళ్లన పరిపాలన అధికారి ముని రామకృష్ణ ఆధ్వర్యంలో అధికారులు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. శ్రీకాకుళం క్యాంపస్‌లో నిర్వహిస్తున్న క్లాస్‌వర్కు, పాలన, చేపడుతున్న అభివృద్ధి పనులను రిజిస్ట్రార్‌కు వివరించారు.
చదవండి: IIIT Admissions : వికలాంగుల కోటా కింద ట్రిపుల్ ఐటీలో సీట్ల భర్తీకి దరఖాస్తులు..
ఐటెప్ మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తి
ఎచ్చెర్ల క్యాంపస్: నాలుగేళ్ల సమీకృత డిగ్రీ కో ర్సు (ఐటీఈపీ)లో మొదటి విడత సీట్లు ఎలాట్‌మెంట్‌ను వర్సిటీ అధికారులు బుధవారం ప్రకటించారు. నేషనల్ టెస్టింట్ ఏజెన్సీ నిర్వహించిన నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌లో వచ్చిన మార్కుల స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పించారు. నాలుగేళ్ల బీఏబీఎడ్ కోర్సుల్లో 50 సీట్లు ఉండగా మూడు సీట్లు కేటాయించారు.
బీఎస్సీ బీఎడ్‌లో 50 సీట్లు ఉండగా, 25 ప్రవేశాలు కల్పించారు. సీట్లు కేటాయించిన విద్యార్థులు 20వ తేదీలోపు బీఏకు రూ.15000, బీఎస్సీకి రూ.18000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించే విద్యార్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. వెయిటింగ్ లిస్టులో ఉన్న వారికి రెండో విడతలో సీట్లు కే టాయిస్తారు.
Tags
- ITI Counseling
- DLTC/ITI Training Centre
- iti admissions
- Y Rammohan Rao
- Verification of Certificates
- Tailoring Training
- srikakulam district news
- andhra pradesh news
- SrikakulamNewColony
- AssistantDirectorYRammohanRao
- September28Counseling
- 4thPhaseCounseling
- DLTCTrainingCenter
- ITITrainingCenter
- SurplusSeats
- SrikakulamDLTC
- ITIAdmission
- SrikakulamCounseling