ISRO Yuvika 2022: రిజిస్ట్రేషన్ ప్రారంభం.. చివరి దేదీ ఇదే..
మార్చి 10 నుంచి ఏప్రిల్ 10వ తేదీ దాకా ఉత్సాహవంతులైన విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఇస్రో ప్రకటించింది. యువికా–2022కు ఎంపికైన వారి జాబితాను ఏప్రిల్ 20న వెల్లడిస్తారు. మే నెల 16 నుంచి 28వ తేదీ దాకా యువికా ప్రోగ్రామ్‌ను నిర్వహించేందుకు ఇస్రో ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ప్రతి రాష్ట్రం నుంచి 9వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులను ఎంపిక చేసి రెండు వారాలు రెసిడెన్షియల్ శిక్షణకు పంపిస్తారు. ఇస్రో పరిధిలోని నాలుగు కేంద్రాలు అంటే.. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (త్రివేండ్రం), ప్రొఫెసర్ యూఆర్ రావు స్పేస్ సెంటర్ (బెంగళూరు), స్పేస్ అప్లికేషన్ సెంటర్ (అహ్మదాబాద్), నార్త్ ఈస్ట్రన్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ (మేఘాలయ) సెం టర్లలో శిక్షణ ఇస్తారు. వివరాలు కావాలనుకునే విద్యార్థులు, ఉపాధ్యాయులు www//isro.gov.in వెబ్‌సైట్‌ను చూస్తే మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
చదవండి:
ATL 2021: స్పేస్ చాలెంజ్ లో గురుకుల విద్యార్థుల ప్రతిభ.. విజేతల వివరాలు..