Skip to main content

Central Tribal Welfare Department: రిపబ్లిక్‌ డే వేడుకలకు గిరిజన విద్యార్థులకు ఆహ్వానం

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని 30 మంది గిరిజన విద్యార్థులకు ఆహ్వానం అందింది.
30 tribal students from Hyderabad to shine at Republic Day event in Delhi   Invitation to tribal students for Republic Day celebrations    30 tribal students from Hyderabad at Republic Day in Delhi   Tribal students from Hyderabad representing their culture at Republic Day in Delhi

ఆశ్రమ పాఠశాలల్లో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా చదువులో, ఆటల్లో, సాహిత్య పోటీల్లో, సాంస్కృతిక కార్యక్రమాలు, సైన్స్‌ఫెయిర్‌ తదితర కార్యక్రమాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 15 మంది బాలురు, 15 మంది బాలికలకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ ఈ అరుదైన అవకాశం కల్పించింది.

చదవండి: Republic Day 2024: గణతంత్ర వేడుకల్లో మహిళా త్రివిధ దళాల బృందం

ఈమేరకు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆయా విద్యార్థులకు ఆహ్వానం పంపింది. ఎంపికైన విద్యార్థులను ఢిల్లీకి తీసుకెళ్లేందుకు ముగ్గురు గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు చందన సర్పే, స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ బెల్లంకొండ జ్యోతి, బానోత్‌ లాలూలను లైజన్‌ అధికారులుగా ప్రభుత్వం నియమించింది.

చదవండి: NCC Republic Day Camp 2024: గణతంత్ర వేడుకల్లో ఈశాన్య విద్యార్థినుల బ్యాండ్‌..!

ఈ విద్యార్థులు జ‌న‌వ‌రి 24న ప్రధానమంత్రి కార్యాలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. 25న ఢిల్లీలోని చారిత్రక ప్రాంతాల సందర్శన తర్వాత 26న గణతంత్ర వేడుకల్లో పాల్గొంటారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.   

Published date : 22 Jan 2024 12:37PM

Photo Stories