NDMA: నేతాజీ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
కామారెడ్డి క్రైం: విపత్తు నిర్వహణలో విశేష కృషి స ల్పిన వ్యక్తులు, సంస్థల నుంచి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ అవార్డులకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆ హ్వానిస్తున్నదని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆగస్టు 17న తెలిపారు.
జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి సందర్భంగా విపత్తు నిర్వహణలో అద్భుతమైన పనితీరు కనబరచిన వ్యక్తులకు, సంస్థలకు భారత ప్రభుత్వం ప్రతి ఏటా అవార్డును అందిస్తున్నదన్నారు. అవార్డుకు ఎంపికై న వ్యక్తులకు, సంస్థలకు మూడు రకాల నగదు బహుమతులు అందజేస్తుందన్నారు. 2024 సంవత్సరానికి గాను అవార్డుకు అర్హులని భావించిన వ్యక్తులు లేదా సంస్థలు సంబంధిత వెబ్‌సైట్‌లో ఆగస్టు 30 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
చదవండి:
Bala Puraskar Awards 2023: బాల పురస్కార్ అవార్డులకు దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే..
Devulapalli Ramanujarao Award 2023: దిలీప్ రెడ్డికి దేవులపల్లి రామానుజరావు పురస్కారం
Published date : 18 Aug 2023 03:53PM