Skip to main content

Kamal Kishore: ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ప్రత్యేక ప్రతినిధిగా కమల్‌ కిశోర్

జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55) ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు.
Kamal Kishore Appointed Special Representative Of UN Disaster Risk Reduction

విపత్తు ముప్పు తగ్గించే విషయాల్లో ఆయన సెక్రటరీ జనరల్‌కు సలహాలివ్వనున్నారు.

అనుభవం: కిశోర్‌కు విపత్తు నిర్వహణ రంగంలో 30 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. భారతదేశంలో వివిధ హోదాల్లో పనిచేశారు.
విద్య: ఢిల్లీలోని జవహార్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి భూగోళ శాస్త్రంలో డాక్టరేట్ పట్టా పొందారు.
అంతర్జాతీయ గుర్తింపు: విపత్తు నిర్వహణ రంగంలో ఆయన చేసిన కృషికి అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు.

➤ 2015 నుంచి భారత ప్రభుత్వ కార్యదర్శిగా నిర్వహిస్తున్నారు.
➤ 2019లో జరిగిన వాతావరణ చర్య సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన విపత్తు రక్షిత మౌలిక సదుపాయాలను నిర్మించారు. 
➤ G20 దేశాల అధ్యక్షత సమయంలో, విపత్తు నిర్వహణపై G20 వర్కింగ్ గ్రూపున‌కు నేతృత్వం వహించారు.

బాధ్యతలు..
విపత్తు ముప్పు తగ్గించడం: ఐరాస సభ్య దేశాలకు విపత్తు ముప్పు తగ్గించడంలో సహాయం చేయడం కిశోర్ బాధ్యతల్లో ఒకటి.
ప్రపంచ విపత్తు నివేదిక: ప్రపంచ విపత్తు నివేదిక రూపకల్పనలో కూడా ఆయన పాల్గొంటారు.
సలహాలు: విపత్తు నిర్వహణకు సంబంధించి సెక్రటరీ జనరల్‌కు సలహాలివ్వడం కిశోర్ ప్రధాన బాధ్యత.

Ashwani Kumar: FIEO అధ్యక్షుడిగా అశ్వనీ కుమార్ ఎన్నిక

Published date : 29 Mar 2024 06:41PM

Photo Stories