Intermediate: పరీక్షలను సజావుగా నిర్వహించాలి.. పరీక్ష పేపర్లను ఇలా ఓపెన్ చేయాలి
జనవరి 30న కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లు, అధికారులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 1నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు ఉంటాయన్నారు.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్
అభ్యర్థులు ఒక గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా చూడాలన్నారు. థియరీ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 14 వరకు జరుగుతాయన్నారు. పరీక్షల నిర్వహణకు కామారెడ్డి, బిచ్కుంద, బాన్సువాడలలో 50 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్ష పేపర్లను ఓపెన్ చేయాలని సూచించారు.
కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఇంటర్ బోర్డు నోడల్ అధికారి షేక్ సలాం, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు శ్రీనాథ్, నాగేశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.