Intermediate: ఇంటర్ పరీక్షలకు 19,509 మంది... సీసీ కెమెరాల నిఘాలో!
ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు నిర్వహించే ఇంటర్ పరీక్షల ఏర్పాట్లపై ఫిబ్రవరి 22న కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 19,509 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. ఇందుకోసం 37 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్
సంబంధిత అధికారులు వెంటనే పరీక్ష కేంద్రాలను సందర్శించాలన్నారు. ఫర్నిచర్, విద్యుత్, తాగునీరు, వెలుతురు లాంటి మౌలిక సదుపాయాలను పరిశీలించి, నివేదిక అందించాలని సూచించారు. ఆ నివేదిక ఆధారంగా సౌకర్యాల కల్పనకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు కొనసాగుతాయన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సు సర్వీసులను నడపాలని సూచించారు. సమావేశంలో ఇంటర్ బోర్డు నోడల్ అధికారి షేక్ సలాం, పరీక్షల విభాగం అధికారులు పాల్గొన్నారు.