Admissions 2024:గురుకుల కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
గురుకుల కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
గురుకుల కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
షాద్‌నగర్: పట్టణ శివారులోని నూర్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో కొనసాగుతున్న నాగర్‌కర్నూల్ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రాంతీయ సమన్వయ అధికారి విద్యుల్లత తెలిపారు. ఆస క్తి గల విద్యార్థినులు ఏప్రిల్ 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఇంటర్ పాసైన వారు దరఖాస్తు చేసుకోవాలని, ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కళాశాలలో విద్యార్థి నులకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ సుజాత తెలిపారు.