Skip to main content

Gurukul Educational Institutions: సంక్షేమ విద్యార్థుల డైట్, కాస్మొటిక్‌ చార్జీలు పెంచండి

Increase the diet and cosmetic charges of welfare students

ఈ మేరకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ప్రస్తుత చార్జీలు, ప్రతిపాదిత చార్జీలతో కూడిన నివేదికను అక్టోబర్ 21న సమర్పించింది. ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 16 ఏళ్ల కిందట సంక్షేమ విద్యార్థుల డైట్‌ చార్జీలు, కాస్మొటిక్‌ చార్జీలను పెంచగా ఆ తర్వాత నుంచి పెంచలేదు.

చదవండి: Skill University: తక్షణ ఉపాధి లభించే నైపుణ్య కోర్సులు.. పలు కోర్సులు సూచించిన వర్సిటీలు

పెరిగిన ధరల నేపథ్యంలో విద్యార్థుల ఇబ్బందుల దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తోపాటు ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం తదితరులు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టికి ఇటీవల వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన సీఎం.. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అధ్యక్షతన అక్టోబర్ 17న కమిటీ ఏర్పాటు చేశారు.

పలు అధ్యయనాలు చేసిన ఈ కమిటీ... ప్రస్తుత ధరలు, 40 శాతం పెంచాల్సిన ధరలతో డైట్, కాస్మొటిక్‌ చార్జీల ప్రతిపాదనలను డిప్యూటీ సీఎంకు నివేదించింది. ప్రభుత్వం ధరలు పెంచితే 7,65,705 మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.

ఉన్నతాధికారుల కమిటీ సమర్పించిన ప్రతిపాదనలివే...
 

డైట్‌ చార్జీలు (రూ. లలో)

 

 

తరగతి

ప్రస్తుతం

ప్రతిపాదన

3– 7 వరకు

950

1,330

8 –10 వరకు

1,100

1,540

ఇంటర్, డిగ్రీ, పీజీ

1,500

2,100

కాస్మొటిక్‌ చార్జీలు

తరగతి

       విద్యార్థినులు

 

     విద్యార్థులకు..

 

 

ప్రస్తుతం

ప్రతిపాదన

ప్రస్తుతం

ప్రతిపాదన

3 – 7 వరకు

55

175

62

150

8 –10 వరకు

75

275

62

200

Published date : 22 Oct 2024 12:35PM

Photo Stories