Dharmendra Pradhan: ఐఐటీయన్లు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ఎదిగాలి
జూలై 3న సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌లో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఐఐటీ హైదరాబాద్‌లో నూతనంగా నిర్మించిన టెక్నాలజీ ఇన్నోవేషన్ పార్కు, రిసెర్చ్ సెంటర్ కాంప్లెక్స్ భవనాలను ప్రారంభించారు.
ఐఐటీ హైదరాబాద్ ఆడిటోరియంలో కేంద్రమంత్రి సమక్షంలో The English and Foreign Languages University (EFLU), IIT Hyderabad కలిసి పనిచేయాలన్న ఎంవోయూపై ఇఫ్లూ వీసీ సురేశ్‌కుమార్, ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి సంతకాలు చేశారు. గ్రీన్‌కో స్కూల్ ఆఫ్ సస్ట్టెయినబుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏర్పాటు కోసం గ్రీన్‌కో సంస్థ ప్రతినిధి అనిల్‌కుమార్, ఐఐటీ డైరెక్టర్ బీఎస్ మూర్తి ఎంవోయూపై సంతకాలు చేశారు.
Greenko inks MoU w/@IITHyderabad for India’s 1st dedicated school of sustainable science & technology - 'Greenko School of Sustainable Science & Technology' in the presence of Shri @dpradhanbjp. The school will advance knowledge in areas like #ClimateChange #AI & #SpaceTech pic.twitter.com/bGurYapHVb
— Greenko (@GreenkoIndia) July 2, 2022