IIIT: మునుగోడులో ట్రిపుల్ ఐటీ!
నవంబర్ 8న మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ముగియడంతో నవంబర్ 14న కీలక సమీక్ష సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. చండూరు మండల కేంద్రంలో జరిగే ఈ సమావేశానికి అరడజనుకుపైగా మంత్రులు, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యే అవకాశముంది. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్‌తోపాటు పలు ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొంటారని టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
మునుగోడులో ఇచ్చిన హామీల అమలును సీరియస్‌గా తీసుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దీనికి అవసరమైన ప్రణాళిక, కార్యాచరణ రూపొందించుకోవాలని ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం వెలువడిన తర్వాత తనను కలిసిన నూతన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి కూడా ఇదే అంశాన్ని సీఎం నొక్కి చెప్పారు.