Skip to main content

CA Intermediate Exam: సీఏలో దుమ్మురేపిన హైద‌రాబాద్ కుర్రాడు.. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే ఆల్ ఇండియా ఫ‌స్ట్ ర్యాంకు సాధించిన శ్రీక‌ర్‌

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటైన చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇంటర్మీడియట్ ప‌రీక్ష ఒక‌టి. ప్ర‌తీ ఏడాది దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌ల మంది విద్యార్థులు ప‌రీక్ష‌లు రాస్తారు. ఉత్తీర్ణ‌త శాతం మాత్రం 10 నుంచి 20 శాతం మ‌ధ్య‌లోనే ఉంటుంది. అంటే వంద మందిలో కేవ‌లం 10 - 20 మంది మాత్ర‌మే ఉత్తీర్ణుల‌వుతున్నారు.
CA Intermediate Exam: సీఏలో దుమ్మురేపిన హైద‌రాబాద్ కుర్రాడు.. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే ఆల్ ఇండియా ఫ‌స్ట్ ర్యాంకు సాధించిన శ్రీక‌ర్‌
CA Intermediate Exam: సీఏలో దుమ్మురేపిన హైద‌రాబాద్ కుర్రాడు.. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే ఆల్ ఇండియా ఫ‌స్ట్ ర్యాంకు సాధించిన శ్రీక‌ర్‌

అయితే తాజాగా విడుద‌లైన ఈ ఫ‌లితాల్లో మ‌న హైద‌రాబాద్ కుర్రాడు ఆలిండియా టాపర్‌గా నిలిచాడు.

ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో హైదరాబాద్ కు చెందిన వై.గోకుల్ సాయి శ్రీకర్(18) సీఏ ఇంటర్మీడియట్ పరీక్షలో 800 మార్కులకు 688 (86 శాతం) మార్కులు సాధించాడు.

Success Story: వ‌రుస‌గా నాలుగు సార్లు ఫెయిల్‌...ఏడేళ్ల నిరీక్ష‌ణ‌.. చివ‌రికి ఐఎఫ్ఎస్ సాధించానిలా...

పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి విద్యార్థులు తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతుంటారు. ఏళ్లకేళ్లు ప‌రీక్ష‌పైనే కూర్చుని పాస్ అవ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటారు. కానీ, శ్రీక‌ర్ మాత్రం త‌న మొద‌టి ప్ర‌య‌త్నంలోనే స‌క్సెస్ అయ్యాడు. ప్ర‌తీ రోజూ 13 గంటల పాటు చ‌దివేవాడిన‌ని ఈ సంద‌ర్భంగా శ్రీక‌ర్ తెలిపాడు. 

ca

''సీఏ ఇంటర్మీడియట్ సిల‌బ‌స్‌ భారీగా ఉంది. అన్ని సబ్జెక్టులకు సమయం కేటాయించాలి. దీంతో ప‌ద్ధ‌తి ప్ర‌కారం ఒక్కో స‌బ్జెక్ట్‌కు నిర్ణీత స‌మ‌యం కేటాయించుకున్నా. సీఏలో విజయం సాధించాలంటే కాన్సెప్ట్‌ల‌వారీగా అవగాహన కీలకం. ప్ర‌తీ చిన్న విష‌యాన్ని అర్థం చేసుకుని చదివితేనే విజ‌యం సాధిస్తాం. ఒత్తిడిని అధిగ‌మించేందుకు బ్యాడ్మింటన్ ఆడేవాడిని. అప్పుడ‌ప్పుడు వాకింగ్ చేసేవాడిని'' అని శ్రీక‌ర్ మీడియాకు తెలిపాడు.

July Month Exams: జులైలో నిర్వ‌హించ‌నున్న ప్ర‌భుత్వ పరీక్ష‌ల తేదీలు ఇవే...

కాగా, పాటియాలాకు చెందిన నూర్ సింగ్లా, ముంబైకి చెందిన కావ్య సందీప్ కొఠారి 85.25 శాతం, 84.75 శాతం మార్కులతో ఆలిండియా ద్వితీయ, తృతీయ టాపర్లుగా నిలిచారు.

ca

సీఏ ఇంటర్మీడియట్ గ్రూప్ -1 పరీక్షకు మొత్తం 1,00,781 మంది అభ్యర్థులు హాజరుకాగా 18.95 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు. గ్రూప్ -2 పరీక్షలకు 81,956 మంది హాజ‌రైతే 23.44 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. రెండు గ్రూపులకు కలిపి 39,195 మంది హాజరుకాగా 10.24 శాతం మంది అర్హత సాధించారు.

NEET 2023 Racket: నీట్‌లో భారీ కుంభ‌కోణం... ఏడు ల‌క్ష‌ల‌కు ప‌రీక్ష రాసి పోలీసుల‌కు చిక్కిన ముఠా..!

ఇక సీఏ ఫైన‌ల్ ప‌రీక్ష‌లో అహ్మదాబాద్‌కు చెందిన జైన్ అక్షయ్ రమేష్, చెన్నైకి చెందిన కల్పేష్ జైన్ జి, న్యూఢిల్లీకి చెందిన ప్రఖార్ వర్ష్నే ఆలిండియా ఫస్ట్, సెకండ్, థర్డ్ టాపర్లుగా నిలిచారు. 

Published date : 06 Jul 2023 06:14PM

Photo Stories