Scholarships: విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం తోడ్పాటు
ప్రకాశం జిల్లా సీఎస్ పురంలోని కదిరి బాబూరావు అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కాలేజీలో నవంబర్ 2న ‘అమెరికా విద్య–సలహాలు–సూచనలు’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కుమార్ మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల విద్యార్థులకు విదేశీ విద్యను చేరువ చేసేందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దూర దృష్టితో విదేశీ విద్యా విభాగాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు.
చదవండి: NMMS Scholarship: నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్.. ప్రతి నెల రూ.వెయ్యి స్కాలర్‌షిప్
విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా విదేశాల్లో చదువుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. ఏం చదవాలి.. ఎక్కడ చదవాలి... ఎక్కడెక్కడ ఏయే అవకాశాలు ఉన్నాయి... వంటి అంశాల్లో విదేశీ వర్సిటీలకు, విద్యార్థులకు మధ్య ఏపీ విదేశీ విద్యా విభాగం అనుసంధానకర్తగా వ్యవహరిస్తోందని చెప్పారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు, కదిరి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.