Skip to main content

Free Training: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ

భూదాన్‌పోచంపల్లి: మండలంలోని జలాల్‌పురంలో గల స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో సోలార్‌ సిస్టమ్‌ ఇన్‌స్టాలేషన్‌ అండ్‌ సర్వీస్‌ కోర్సులో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్‌ పీఎస్‌ఎస్‌ఆర్‌ లక్ష్మి ఫిబ్ర‌వ‌రి 20న‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Free training for unemployed youth   Swami Ramananda Thirtha Rural Institute free training for youth

4 నెలల కాలపరిమితి కల్గిన ఈ కోర్సుకు పదో తరగతి పాసై లేదా ఐటీఐ విద్యార్హత కల్గి ఉండాలని, 18 నుంచి 35 ఏళ్ల వయస్సు కల్గి ఉండాలన్నారు. ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ విద్యార్థులకు ప్రాధాన్యత కల్పించబడుతుందని తెలిపారు.

చదవండి: Police Constable Training 2024- రెండు దశల్లో కానిస్టేబుల్‌ శిక్షణ, మొత్తం ఎంతమంది అంటే..

ఆసక్తి కల్గిన వారు తమ విద్యార్హతల సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలతో మార్చి 1న సంస్థలో నిర్వహించే కౌన్సిలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. ఎంపికై న వారికి ఉచిత హాస్టల్‌, భోజన వసతి కల్పించబడుతుందని అన్నారు. వివరాలకు 9848908059, 9133908000 నంబర్లను సంప్రదించాలన్నారు.

Published date : 21 Feb 2024 04:07PM

Photo Stories