Free Coaching: ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ
Sakshi Education
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో తుళ్లూరులోని నేషనల్ అకాడమీ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఏర్పాటు చేసిన స్కిల్‌హబ్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.ప్రణయ్ ఫిబ్రవరి 4న ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
అసిస్టెంట్ సర్వేయర్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, సూయింట్ మిషన్ ఆపరేటర్ (టైలరింగ్) కోర్సుల్లో టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు రెండు నెలలపాటు ఉచిత నైపుణ్య శిక్షణ కల్పించి, స్థానిక, వివిధ రాష్ట్రాల్లోని పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.
విద్యార్హతల ఆధారంగా ఆయా కోర్సులకు నమోదు చేసుకోవాలని, ఇతర వివరాలకు తమ ప్రతినిధులు వెంకట్ (95057 19172), జ్మోతిర్మయి (98482 55009)ను సంప్రదించాలని సూచించారు.
Published date : 06 Feb 2024 10:48AM