Andhra Pradesh: గిరిజన విద్యార్థులకు క్రీడల్లో ప్రోత్సాహం
స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతి వేడుకలను పురస్కరించుకొని రాష్ట్రంలోని 8 ఐటిడీఏల పరిధిలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నవంబర్ 23 నుంచి 26వ తేదీ వరకు విశాఖలో క్రీడా పోటీలు నిర్వహించారు.
గిరిజన స్వాభిమాన ఉత్సవాలు పేరుతో నిర్వహించిన ఈ పోటీల్లో రంపచోడవరం ఐటీడీఏ నుంచి 35 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ పోటీల్లో బహుమతులు సాధించిన విద్యార్థులు నవంబర్ 27న ఐటీడీఏ పీవోను కలిశారు.
చదవండి: School Games Federation: జెడ్పీ విద్యార్థినికి కాంస్య పతకం
జావిలిన్‌త్రోలో రెండవ స్థానంలో సిల్వర్ మెడల్‌ను కాకవాడ ఆశ్రమ పాఠశాల చెందిన ఎం.లక్ష్మి, మూడో స్థానంలో కొత్తవీధి ఆశ్రమ పాఠశాలకు చెందిన కె. రాజారెడ్డి, వ్యాసరచనలో మూడో బహుమతి కాకవాడ ఆశ్రమ పాఠశాల చెందిన ఎం.యోగిత సాధించారు. వీరిని పీవో అభినంధించారు.
ఈ సందర్భంగా పీవో సూరజ్ గనోరే మాట్లాడుతూ ఏజెన్సీలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, గురుకుల పాఠశాలలు, గిరిజన ఆశ్రమ పాఠశాల్లో చదువుతున్న విద్యార్థులకు జిల్లా, రాష్ట్ర స్థాయి, జాతీయస్థాయి ఆటల పోటీలలో పాల్గొనే విధంగా ప్రోత్సహిస్తామన్నారు. ఏపీవో శ్రీనివాసరావు, ఏజెన్సీ డీఈఓ మల్లేశ్వరరావు, పీడీలు కె.తిరుపతిరావు, ఎ.బాలరాజు, లక్ష్మి, పోతురాజు, పీఈటీలు ప్రసాద్‌లు పాల్గొన్నారు.