TS TET 2022: మీ అప్లికేషన్ ఫామ్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. టెట్ పేపర్–2 స్వరూపం..
అభ్యర్థులు రెండు విధాలుగా టెట్ అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. Candidate ID ఆధారంగా లేదా Journal Number ఆధారంగా అభ్యర్థులు సబ్మిట్ చేసిన టెట్ అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
చదవండి:
టెట్‌లో 120+ మార్కులు గ్యారంటీ కొట్టే మార్గం ఇదే.. ||TET Best Preparation Tips, Books, Syllabus
TS TET 2022 Preparation Tips : టెట్‌లో ఉత్తమ స్కోర్ సాధిస్తే.. డీఎస్సీలోనూ అది కలిసొస్తుందా?
టెట్ పేపర్–2 స్వరూపం :
ఆయా సబ్జెక్ట్‌లలో స్కూల్ అసిస్టెంట్ పోస్ట్‌లకు ప్రామాణికంగా పేర్కొనే టెట్ పేపర్–2ను కూడా నాలుగు విభాగాలుగా,150మార్కులకు నిర్వహిస్తారు. ఈ పేపర్ కూడా పూర్తిగా బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. వివరాలు..
విభాగం | సబ్జెక్ట్ | ప్రశ్నలు | మార్కులు |
1 | చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజి | 30 | 30 |
2 | లాంగ్వేజ్1 | 30 | 30 |
3 | లాంగ్వేజ్ 2 (ఇంగ్లిష్) | 30 | 30 |
4 | సంబంధిత సబ్జెక్ట్ | 60 | 60 |
మొత్తం | 150 | 150 |
గమనిక:టెట్ పేపర్–1, పేపర్–2లను 150 మార్కులు చొప్పున నిర్వహిస్తారు.
- నాలుగో విభాగంగా నిర్వహించే సంబంధిత సబ్జెక్ట్ విషయంలో.. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ అభ్యర్థులు మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగాన్ని, సోషల్ టీచర్లు సోషల్ స్టడీస్ విభాగాన్ని ఎంచుకుని పరీక్ష రాయాలి.
- సబ్జెక్ట్ పేపర్‌కు సంబంధించి కంటెంట్ నుంచి 24 ప్రశ్నలు, పెడగాజి నుంచి ఆరు ప్రశ్నలు చొప్పున ప్రతి సబ్జెక్ట్ విభాగం నుంచి అడుగుతారు.
- సైన్స్ సబ్జెక్ట్ విషయంలో ఫిజికల్ సైన్స్ నుంచి 12, బయలాజికల్ సైన్స్ నుంచి 12 ప్రశ్నలు చొప్పున కంటెంట్ సంబంధిత ప్రశ్నలు ఉంటాయి. మిగతా ఆరు ప్రశ్నలు సైన్స్ పెడగాగీ నుంచి అడుగుతారు.
- సోషల్ విభాగంలో హిస్టరీ, జాగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్‌ల నుంచి 48 కంటెంట్ ప్రశ్నలు, 12 పెడగాజి ప్రశ్నలు అడుగుతారు.
- ఈ సబ్జెక్ట్ విభాగం విషయంలో రెండు అర్హతలు ఉన్న వారు తమకు ఆసక్తి ఉన్న విభాగం పరీక్ష రాసే అవకాశం అందుబాటులో ఉంది.
- లాంగ్వేజ్–1 విభాగానికి సంబంధించి టెట్ పేపర్–1 మాదిరిగానే ఆయా లాంగ్వేజ్‌లను ఎంచుకోవచ్చు.
చదవండి:
TSTET Syllabus 2022
అర్హత మార్కులు ఇవే..
రెండు పేపర్లుగా నిర్వహించే టెట్ పేపర్–1, పేపర్–2లలో అభ్యర్థులు తప్పనిసరిగా కనీస అర్హత మార్కులు పొందాలనే నిబంధన విధించారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం అరవై శాతం మార్కులతో(90 మార్కులు) ఉత్తీర్ణత సాధించాలి. బీసీ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం మార్కులతో(75 మార్కులు), ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగుల కేటగిరీలకు చెందిన అభ్యర్థులు 40 శాతం మార్కులతో (60 మార్కులు) ఉత్తీర్ణత సాధించాలి. ఈ మార్కులు సాధించిన వారికే టెట్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు.
టీఎస్ టెట్–2022 ముఖ్యమైన తేదీలు ఇవే..
- టెట్ తేదీ: జూన్ 12, 2022
- పేపర్–1: ఉదయం 9:30నుంచి 12:00 వరకు
- పేపర్–2: మధ్యాహ్నం 2:30నుంచి 5:00వరకు
- ఫలితాల వెల్లడి: జూన్ 27, 2022
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://tstet.cgg.gov.in
ఏపీ తరహాలో..
భాషాపండితులకు 2018లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేపర్–3 నిర్వహించింది. అదే తరహాలో ఇక్కడా భాషపైనే ఎక్కువ సిలబస్‌తో ప్రశ్నలు ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలా అయితేనే 30 వేల భాషాపండితులకు ప్రభుత్వం న్యాయం చేయగలుగుతుంది. కానీ, దీన్ని పట్టించుకోకపోవడంతో ఆశలన్నీ అడియాసలయ్యాయి.
– సి.జగదీశ్ (రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు, రాష్ట్ర అధ్యక్షుడు)