Sports Coaching: స్పోర్ట్స్ కోచింగ్ డిప్లొమాకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, అమరావతి: భారత క్రీడా ప్రాధికార సంస్థ (శాయ్), నేతాజీ సుభాష్ జాతీయ క్రీడా సంస్థ వివిధ విభాగాల్లో స్పోర్ట్స్ కోచింగ్ సెషన్ 2022–23 డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత గల అభ్యర్థులు https://www.dipsc.nsnis.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్ అడ్మిషన్ టెస్ట్, వర్చువల్ ఇంటర్వూ్యలో ప్రతిభ ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇంటర్ విద్యార్హత (తత్సమాన)తో భారత్ తరఫున ఒలింపిక్‌కు ప్రాతినిధ్యం వహించిన వారు, సీనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న క్రీడాకారులు, కామన్‌వెల్త్, ఏషియన్ పతక విజేతలకు కేటగిరి ఏ(1) కింద నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. స్పోర్ట్స్ డిగ్రీతో పాటు 21 నుంచి 35 ఏళ్లు అర్హత వయసుగా నిర్ణయించారు. దరఖాస్తు రుసుము రూ.1,500.
Also read: Nursing course: ఇక ఎంసెట్ ద్వారా నర్సింగ్ కోర్సులో ప్రవేశం