Skip to main content

National Scholarships: జాతీయ ఉపకార వేతనాలకు ప్రత్యేక పోర్టల్‌

సాక్షి, అమరావతి: కళాశాలలు, యూనివర్సిటీల విద్యార్థులకు అందించే ‘సెంట్రల్‌ సెక్టార్‌ స్కీం స్కాలర్‌షిప్‌’లకు దరఖాస్తు కోసం ప్రత్యేక పోర్టల్‌ అందుబాటులోకి వచ్చినట్లు ఇంటర్మీడియెట్‌ విద్యామండలి కమిషనర్‌ సౌరభ్‌ గౌర్‌ న‌వంబ‌ర్ 2న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Central Sector Scheme Scholarships application portal launched on November 2, dedicated portal for National Scholarships, Commissioner Saurabh Gaur announces Central Sector Scheme Scholarships portal

రాష్ట్రంలోని అన్ని జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ ఈ విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలని సూచించారు. 2023–24 విద్యా సంవత్సరానికి సెంట్రల్‌ సెక్టార్‌ స్కీం స్కాలర్‌షిప్‌ కోసం డిసెంబర్‌ 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, ఈ సమాచారాన్ని డీవీఈవోలు, ఆర్‌ఐవోలు అన్ని మేనేజ్‌మెంట్స్‌ జూనియర్‌ కాలేజీల ప్రిన్సిపాల్స్‌కు తెలియజేయాలన్నారు.

చదవండి: Single Girl Child Scholarship 2023: సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌–2023.. ఎవరు అర్హులంటే..

విద్యార్థుల డేటాను జ్ఞానభూమి పోర్టల్‌లో అందుబాటులో ఉంచామని, వివరాల ఆధారంగా  http://www.scholarships.gov.in వెబ్‌సైట్‌లో స్కాలర్‌షిప్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.   

Published date : 04 Nov 2023 11:32AM

Photo Stories