Skip to main content

Andhra Pradesh: ప్రశాంతంగా సీస్‌ పరీక్ష

కడప ఎడ్యుకేషన్‌: జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ యాజమాన్య పాఠశాలల్లో న‌వంబ‌ర్ 3న‌ నిర్వహించిన సీస్‌ (స్టేట్‌ ఎడ్యుకేషన్‌ అచీవ్‌మెంట్‌ సర్వే) పరీక్ష ప్రశాంతంగా జరిగింది.
CS exam

జిల్లాలోని 1361 పాఠశాలల్లో 3,6, 9వ తరగతి చదువుతున్న 33690 మంది విద్యార్థులు హాజరయ్యారు. చాపాడు మండలంలోని కేజీబీవీ, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి ఎద్దుల రాఘవరెడ్డి, జిల్లా సమగ్రశిక్ష ప్రాజెక్టు అధికారి అంబవరం ప్రభాకర్‌రెడ్డి సందర్శించారు.

చదవండి: School Holidays: న‌వంబ‌ర్ 14న పాఠశాలలకు సెలవు.. ఎందుకంటే..

పరీక్ష జరిగే విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులు సీస్‌కు సంబంధించి ఓఎంఆర్‌ సీట్లో వివరాలు ఎలా నింపారో పరిశీలించి తగిన సూచనలు, సలహాలను ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీస్‌ సర్వే పరీక్ష ద్వారా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు అంచనా వేసేందుకు వీలవుతుందన్నారు.

సర్వే ఫలితాలను బట్టి బోధన అభ్యసనాలను పెంపొందించేందుకు ప్రణాళికలను రూపొందించవచ్చన్నారు. ఇప్పటికే ప్రభుత్వం పాఠశాలలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసిందన్నారు. విద్యా ప్రమాణాలను కూడా పేందుకు కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో చాపాడు మండల విద్యాశాఖ అధికారి రవిశంకర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Published date : 04 Nov 2023 01:34PM

Photo Stories